పెళ్లితో ఒక్కటైన ఇద్దరు యువతులు
వరంగల్: ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. వరంగల్లు జిల్లాకు చెందిన యువతులు ఉషా నాయక్, రుద్రారం కావ్య ఈ నెల 9వ తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న వరంగల్ జిల్లా ముత్తాజీపేటకు చెందిన ఉషా నాయక్ వికలాంగుల సమస్యలపై పోరాటం చేస్తూ ఉంది. ఆమెను కావ్య ప్రేమించింది. ఈ విషయం తెలిసిన కావ్య తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే కావ్య తిరుపతికి పారిపోయి ఉషానాయక్ ను పిలిపించుకుని పెళ్లి చేసుకుంది.
కావ్య తనను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందని, పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని అన్నదని, దాంతో తాను పెళ్లికి అంగీకరించానని ఉషా నాయక్ చెబుతోంది. గుండె జబ్బుతో బాధపడుతున్న కావ్య - ఉష తనకు బాగా నచ్చిందని, అందుకే పెళ్లి చేసుకున్నానని అంటోంది. వీరిద్దరు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఉన్నారు. పిల్లలు కావాలంటే టెస్టు ట్యూబ్ బేబీని కంటానని కావ్య చెబుతోంది.












Click it and Unblock the Notifications