వైయస్ విజయాలు గర్వకారణం: సోనియా

Sonia Gandhi
జగ్గంపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విజయాలు తమకు గర్వకారణమని యుపిఎ చైర్ పర్సన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విజయాల గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారని ఆమె చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో ఆమె శుక్రవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టలేదని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమం జలయజ్ఞం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆమె అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్ర భాగాన నిలిచిందని ఆమె ప్రశంసించారు.

గత జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) ప్రభుత్వ హయాంలోనే రైతుల పరిస్థితి దిగజారిందని ఆమె విమర్శించారు. ఎన్డీయె ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ పథకాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. తమ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం చారిత్రాత్మకమైందని ఆమె అన్నారు. ఎన్జీయె ప్రభుత్వ హయాంలో వరి ధర 60 రూపాయలు మాత్రమే పెరిగిందని, తమ పాలనలో 190 రూపాయలు పెరిగిందని ఆమె అన్నారు. తమ ఎన్నికల ప్రణాళికను, యుపిఎ కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి ప్రారంభించదలుచుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని కూడా ఆమె అభినందించారు. తమ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల కోసం, మహిళల కోసం పని చేస్తుందని, జాతీయ సంపదలో పేదలకు భాగం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఇందిరా భీమా పథకాన్ని ఆమె ప్రారంభించారు.

రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని, ఇది రైతులందరికీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. జలయజ్ఞాన్ని విప్లవంలా కొనసాగిస్తున్నామని ఆమె చెప్పారు. ఇప్పటి వరకు 16 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందించామని, వచ్చే మార్చి నాటికి మరో 26 లక్షల ఎకరాలకు నీరందిస్తామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో సోనియా విజయాలు అనూహ్యమని ఆయన ప్రశంసించారు. రైతుల రుణమాఫీ పథకం సోనియా చలువేనని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభలో పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు, కేంద్ర మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, పల్లంరాజు, వనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించేందుకు బయలు దేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+