పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు అరెస్టు
కర్నూలు: భార్య, ఇద్దరు పిల్లలు ఉండగానే రెండో పెళ్లికి సిద్ధపడిన యువకుడిని పోలీసులు ఆదివారంనాడు పెళ్లి పీటల మీదనే అరెస్టు చేశారు. హైదరాబాదుకు చెందిన సురేష్ అనే వ్యక్తికి కర్నూలుకు చెందిన వెంకటరమణ కూతురికి పెళ్లి నిశ్చయమైంది. వారిద్దరికి కర్నూలులో పెళ్లి జరుగుతుండగా పోలీసులను వెంట పెట్టుకుని సురేష్ మొదటి భార్య వచ్చేసింది. దీంతో పెళ్లి చెడిపోయింది.
సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి తీసికెళ్లారు. పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద తీసుకున్న కట్నం, నగలు ఇప్పించాలని వారు పోలీసులను కోరారు. పెళ్లి పెద్దలను తదితరులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications