చిరంజీవి పార్టీయే పెట్టలేదు: కోటగిరి
ఏలూరు: తాను తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆ పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు చెప్పారు. చిరంజీవి ఇంకా పార్టీయే పెట్టలేదని, అప్పుడే చిరంజీవి పార్టీలో చేరే సమస్య ఎలా ఉత్పన్నమవుతుందని ఆయన అన్నట్లు సమాచారం. కోటగిరి విద్యాధర రావు మంగళవారం తన అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. పరిస్థితిని ఆయన తన అనుచరులకు వివరించారు.
పార్టీలో సఖ్యత కొరవడిందని, అభిమానం కూడా లేకుండా పోయిందని విద్యాధరరావు తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. చిరంజీవి పార్టీలో చేరుతారనే ప్రచారం అనవసరంగా జరిగిపోయిందని విద్యాధరరావు చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి పార్టీలో చేరుతామని చెప్పడానికి తాము మూర్ఖులం కాదని ఆయన అన్నారు. జరగాల్సిందేదో జరుగుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో తనకు అభిప్రాయభేదాలున్నాయని ఆయన ఇటీవల బహిరంగంగానే చెప్పారు. చిరంజీవి పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications