అవినీతిపై 23న లోక్‌సత్తా హైదరాబాద్‌లో సమరశంఖం

Jayaprakash Narayana
హైదరాబాద్: అవినీతిపై సురాజ్య పోరాటానికి లోక్‌సత్తా మార్చి 23న హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టనుంది. భగత్ సింగ్ 77వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే బహిరంగ సభలో దేశం నలుమూలల ఉన్న వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని ఆ పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు.

హైదరాబాద్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రజా ఉద్యమంలా సురాజ్య పోరాటాన్ని ముందుకు నడిపించాలనుకుంటున్నామని వెల్లడించారు. అన్నాహజారే, టీఎన్ శే్షన్, జూలియో రెబెరో, అరవింద్ ఖేర్జివాల్, అరుణా రాయ్, సందీప్ పాండే, గురు శివ్‌ఖేరా తదితరులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు.

పాలకులు మారినా ప్రజలకు మేలు జరగని స్థితిని మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయేషా హత్య కేసు విచారణలో వైఫల్యం ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేసిందన్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులకున్న అర్హత లేమిటనే విషయాన్ని ప్రజలకు సంబంధిత పార్టీలు చెప్పాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+