ఎన్ కౌంటర్: 13 మంది మావోయిస్టుల హతం
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలంలో మంగళవారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టుల మరణించారు. ఈ ఎన్ కౌంటర్ పామేరు పోలీసు స్టేషన్ పరిధిలోని దారెల్లి అడవుల్లో జరిగింది. మృతుల్లో ఆరుగురు దళ కమాండర్లు ఉన్నారు. నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభించాయి. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె 47 రైఫిల్, 4 ఎస్.ఎల్.ఆర్. గన్నులు, 5 తపంచాలు లభించాయి.
సంఘటనా స్థలానికి ఖమ్మం పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) చౌహాన్ బయలుదేరి వెళ్లారు. బీజాపూర్ నుంచి హెలికాప్టర్ రప్పించారు. పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. ఎన్ కౌంటరులో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్ దళాలు గాలింపును ముమ్మరం చేశారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications