భువనగిరి సభ వద్దు: మొయిలీ

తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని ఆయన చెప్పారు. తెరాస నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేసి, యుపిఎ నుంచి వైదొలగడం వల్ల ఏకాభిప్రాయ సాధన మరింత సమస్యగా తయారైందని, వారు యుపిఎలో కొనసాగి ఉంటే ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ కొంత సజావుగా సాగి ఉండేదని ఆయన అన్నారు. సోనియా నిర్ణయానికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు కేంద్ర నాయకులతో సంప్రదింపులు జరపవచ్చు, తమలో తాము చర్చించుకోవచ్చు కానీ బహిరంగ సభలు పెట్టడం సోనియాను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. తెలంగాణపై సమైక్యాంధ్రలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందని, అన్ని పార్టీల శాసనసభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరమని, తెలుగుదేశం పార్టీ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదని, ఇన్ని వైరుధ్యాల వల్ల తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కష్టంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ స్థితిలో తమ పార్టీ సీనియర్ నేతలు పెట్టే సభ తెలంగాణకు గానీ, పార్టీకి గానీ ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications