ప్రధానికి సీమ నేతల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని రాయలసీమ హక్కుల వేదిక నాయకులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కోరారు. వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్ నేతృత్వంలో వారు మంగళవారం పార్లమెంటు ఆవరణలో ప్రధానిని కలుసుకున్నారు. ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపునకు నిపుణుల కమిటీ వేయాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కన్నా రాయలసీమనే వెనకబడి ఉందని, నిపుణుల కమిటీ వేసి రెండు ప్రాంతాల అభివృద్ధిని సమీక్షింపజేయాలని వారన్నారు. ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపునకు కృషి చేస్తామని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. ప్రధానిని కలిసిన వారిలో రాయలసీమకు చెందిన పార్లమెంటు సభ్యులున్నారు.












Click it and Unblock the Notifications