సచివాలయంలో ఎస్సై రివాల్వర్ మిస్ ఫైర్
హైదరాబాద్: సచివాలయంలోని సమతా బ్లాక్ వద్ద ఒక పోలీసు అధికారి సర్వీస్ రివాల్వర్ మంగళవారం మిస్ ఫైర్ కావడం సంచలనం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ సబ్ ఇన్సెపెక్టర్ ఉదయ కిరణ్ తన సర్వీస్ రివాల్వర్ ను డిపాజిట్ చేస్తుండగా అందులోని తూటా ఒక్కటి పేలింది. అయితే ఏ విధమైన ప్రమాదమూ సంభవించలేదు.
ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఎస్సై భద్రతా సిబ్బంది వద్ద డిపాజిట్ చేస్తుండగా రివాల్వర్ పేలింది. దీంతో భద్రతా సిబ్బంది ఆ ఎస్సైని విచారించారు. నగర పోలీసు కమీషనర్ ప్రసాదరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణ జరిపిస్తామని పోలీసు కమీషనర్ చెప్పారు.












Click it and Unblock the Notifications