శివానీ హత్య కేసు: ఆర్కే శర్మ దోషి
న్యూఢిల్లీ: జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఐపియస్ అధికారి ఆర్.కె. శర్మను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. శర్మ ప్రోద్బలంతో శివానీ భట్నాగర్ ను హత్య చేసినందుకు మరో ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి ఎల్లుండి శిక్షను ఖరారు చేస్తుంది. శివానీ భట్నాగర్ హత్య కేసులో 45 రోజుల పాటు పరారీలో ఉన్న ఐపియస్ అధికారి రవికాంత్ శర్మ 2002 సెప్టెంబర్ 27వ తేదీన అంబాలా కోర్టులో లొంగిపోయాడు.
ఈ కేసులో మొదటి అరెస్టుకు మూడేళ్లకు పైగా సమయం పట్టింది. గుర్గావ్ కు చెందిన రెస్టారెంట్ యజమాని శ్రీ భగ్వాన్ ను పోలీసులు 2002 జూలై 23వ తేదీన అరెస్టు చేశారు. ఆగస్టు 2వ తేదీన మరో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్ ప్రదీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు శర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆగస్టు 17వ తేదీన పోలీసులు మూడో నిందితుడు సత్య ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు.
శర్మ సూచనల మేరకు పోలీసులు శివానీ భట్నాగర్ ను హత్య చేసేందుకు పథకం తయారు చేశారని శ్రీ భగ్వాన్ పోలీసులకు చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని శివానీ భట్నాగర్ ఒత్తిడి చేస్తుండడంతో శర్మ ఈ హత్యకు పథకం సిద్ధం చేశాడు. పోలీసులు చార్జీషీట్ ప్రకారం 1998 డిసెంబర్ 24వ తేదీన శర్మ ఢిల్లీలోని అశోకా హోటల్ లో సహ నిందితులు సత్యప్రకాశ్, శ్రీభగ్వాన్, వేద్ ప్రకాశ్ శర్మలను కలిశాడు. ఎల్బీ కోసం శర్మ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమావేశం జరగలేదు. హర్యానా పట్టణాభివృద్ధి సంస్థలోని ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించడంతో పాటు 3 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి సత్యప్రకాశ్ ప్రదీప్ ను కుదుర్చుకున్నాడు.












Click it and Unblock the Notifications