భువనగిరి సభ కొత్త మలుపు

G Venkataswamy
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును చాటి చెప్పేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభ మలుపు తిరిగే అవకాశాలున్నాయి. పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి నివాసంలో సీనియర్ నాయకులు బుధవారం ఉదయం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం మేరకే వారు అత్యవసరంగా సమావేశమైనట్లు భావిస్తున్నారు. అయితే అదేమీ లేదని, సభ ఏర్పాట్లపైనే చర్చించామని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.ఆర్. అమోస్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమపై ఢిల్లీ ఒత్తిడి ఏమీ లేదని ఆయన చెప్పారు. సభ నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సీనియర్లను హెచ్చరించారు. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా సభ నిర్వహిస్తామని సీనియర్లు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, వీరప్ప మొయిలీ రేపు (గురువారం) హైదరాబాద్ రానున్నారు. సీనియర్లను బుజ్జగించేందుకే ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన అనుసరించే వ్యూహం ఏమిటనేది తెలియడం లేదు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీకి కష్టమేనని మరోసారి వెంకటస్వామి అన్నారు. సీనియర్లకు అధిష్ఠాన వర్గంపై గౌరవం ఉందని, కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉందన చెప్పడానికే భువనగిరి సభ పెడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ఢిల్లీలో అన్నారు. ఢిల్లీ నుంచి పిలువు వచ్చిందని, భువనగిరి సభ సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. భువనగిరి సభ జరిగే అవకాశాలు లేవని ఆయన అన్నారు. మంగళ, బుధవారాల్లో కాకా నివాసంలో జరిగిన సీనియర్ల సమావేశానికి ఆయన హాజరు కాలేదు. సీనియర్ల సభను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ యువజన కార్యకర్తలు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. వీరంతా నల్లగొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనుచరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+