టిఆర్ఎస్ కు మారెప్ప కొత్త భాష్యం
హైదరాబాద్: టిఆర్ యస్ కు రాష్ట్ర మంత్రి మారెప్ప కొత్త అర్థం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్న టిఆర్ యస్ అంతర్గతంగా సమైక్యవాదం ఉందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. టిఆర్ యస్ అంటే తెలంగాణ, రాయలసీమ, సర్కారు ప్రాంతాలని, ఆ విధంగా అది సమైక్యవాదానికి స్ఫూర్తిని ఇస్తోందని ఆయన అన్నారు.
టిఆర్ యస్ ఆర్థిక, రాజకీయ, సాంఘిక సౌభాగ్యంతో కూడిన సమైక్యవాదానికి స్ఫూర్తిని అందిస్తోందని ఆయన అన్నారు. విడిపోతే పడిపోతాం, ఊడిపోతాం అనే సందేశాన్ని టిఆర్ఎస్ అందిస్తోందని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాలు దివాళా తీస్తాయని, డాబాల్లాగా రాష్ట్రాలను విడగొట్టడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications