అనుకున్నది సాధించాం: కెసిఆర్
నల్లగొండ: తమ రాజీనామాలతో ఇతర రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించామని, తద్వారా అనుకున్నది సాధించామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యే ప్రమాదం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన గురువారంనాడు అన్నారు.
మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులరహిత సమాజం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను రద్దు చేస్తామని, వాటి స్థానంలో ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications