రేపు శోభన్ బాబు అంత్యక్రియలు
చెన్నై: సినీ నటుడు శోభన్ బాబు అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని శాంతినికేతన్ లో జరుగుతాయి. అమెరికాలో ఉన్న పెద్ద కూతురును సంప్రదించిన తర్వాత అంత్యక్రియలపై నిర్ణయం తీసుకున్నారు. శోభన్ బాబు భౌతిక కాయాన్ని బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు సినీ ప్రముఖులు సందర్సించి నివాళులు అర్పిస్తున్నారు. తాను బయటకు వెళ్లిన పది నిమిషాలకే నాన్నగారు పడిపోయారు, రావాలని తనకు ఫోనులో చెప్పారని, వచ్చేలోగానే తాను తన తండ్రిని కోల్పోయానని శోభన్ బాబు కుమారుడు చెప్పారు. శోభన్ బాబు కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
శోభన్ బాబు మరణవార్త విని ఆయన స్వగ్రామం చిన నందిగామలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శోభన్ బాబు సోదరుడు ఉప్పు సాంబశివరావు కుటుంబ సభ్యులు చెన్నైకి బయలుదేరారు. శోభన్ బాబు మరణవార్తను సాంబశివరావుకు తెలియనివ్వడం లేదు. శోభన్ బాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు నెమరేసుకున్నారు.












Click it and Unblock the Notifications