పాక్ ప్రధానిగా గిలానీ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ బాధ్యతలు చేపట్టారు. దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాక్ కొత్త పార్లమెంట్ ప్రధానిగా ఎన్నుకున్న గిలానీ చేత మంగళవారం ప్రమాణస్వీకారం చేయించారు. గిలానీ సోమవారం ప్రధానిగా ఎన్నికయిన వెంటనే ముషారఫ్ గత ఏడాది చివర్లో ఎమర్జెన్సీ సమయంలో తొలగించిన న్యాయమూర్తులను నిర్భందం నుంచి విడుదల చేయాలని ఆదేశిస్తూ సంచలనం నిర్ణయం ప్రకటించారు.
పాకిస్థాన్‌లో గత నెలలో జరిగిన పాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీలు అత్యధిక మోజారిటీ సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించాయి. ఈ రెండు పార్టీలు, మరికొన్ని ఇతర చిన్న పార్టీలతో కలసి పాకిస్థాన్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గిలానీని పీపీపీ ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టగా, పాక్ కొత్త పార్లమెంట్ సోమవారం ఆయనను ప్రధానిగా ఎన్నుకుంది. గత ఏడాది హత్యకు గురైన పాక్ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టోకు గిలానీ సన్నిహితుడు.












Click it and Unblock the Notifications
