నాపై అపోహలు వద్దు: ఉప్పునూతల

హైదరాబాద్: తాను ప్రత్యేక తెలంగాణవాదినేనని, తనపై అపోహలు అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలపెట్టిన భువనగిరి సభను రద్దు చేస్తూ ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చేసిన ప్రకటనపై విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. తమ మధ్య విభేదాలు సమసిపోతాయని, తాము కలిసి పోతామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ కోసం తాను పోరాడుతానని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రాంతీయ బోర్డు చట్టబద్ధ సంస్థనేనని, మరో చట్టబద్ధ సంస్థ అవసరం లేదని ఆయన అన్నారు. వెనకబడిన ప్రాంతాలపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పూనుకోవడంపై ఆయన ఆ విధంగా అన్నారు. ప్రాంతీయ బోర్డుకు నిధులు, విధులు ఇవ్వకుండా మరో చట్టబద్ద సంస్థ ఎందుకని ఆయన అడిగారు. నిధులు, విధులు అప్పగిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+