ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రేపు (గురువారం) అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని తాము ప్రతిపాదించడం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పనికి వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయమై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులు, ధరల నియంత్రణ వంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను తాము ఎత్తి చూపదలుచుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒక్క అవినీతిలోనే విజయం సాధించిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications