సాఫ్ట్ వేర్ దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని చందానగరులో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ఫోటెక్ లో పనిచేస్తున్న రామకృష్ణ, సౌమ్య దంపతులు అన్నపూర్ణా ఎంక్లెవ్ లోని తమ అపార్టుమెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిది తూర్పు గోదావరి జిల్లా. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. అప్పటి నుంచి వీరిద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారని ఇరుగుపొరుగువారు అంటున్నారు.
బెంగుళూరులో మంచి ఉద్యోగం రావడంతో ఈ నెల 20వ తేదీన వెళ్లి రామకృష్ణ అక్కడ చేరాల్సి ఉంది. ఇందుకుగాను ప్రస్తుత ఉద్యోగానికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రామకృష్ణ కెనడా వెళ్లాలని అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. భార్యాభర్తలు ఎప్పుడూ తగువు పడినట్లు కనిపించలేదని, అయితే ఎల్లవేళలా తలుపులు వేసుకునే ఉండేవారని పొరుగువారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications