మంత్రివర్గం నుంచి దాసరి తొలగింపు
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి వర్గం నుంచి ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు. మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ చేపట్టడానికి మన్మోహన్ సింగ్ కు అవకాశం కల్పిస్తూ వారు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాసరి నారాయణరావు, టి. సుబ్బరామిరెడ్డి ఉన్నారు. మాణిక్ రావు, సురేష్ పచౌరి, అఖిలేష్ దాస్, రాజశేఖరన్ ఉన్నారు. యువకులకు ఈసారి మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ అవకాశం కల్పిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
వాయలార్ రవికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కే పరిస్థితి లేదు. జ్యోతిరాదిత్య సింధియా, జతిన్ ప్రసాద్, రఘునాధ్ ఝాలకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వి. నారాయణస్వామికి కూడా మంత్రిపదవి దక్కవచ్చునని అంటున్నారు. మంత్రి పదవులు దక్కే వారిలో రామేశ్వర్ ఒరెగావ్, సంతోష్ భగొడియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications