కుతూహలమ్మ పావు: టిడిపి ఎస్సీ సెల్
హైదరాబాద్: శాసనసభ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను కాంగ్రెస్ పావుగా వాడుతోందని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు విమర్శించారు. కుతూహలమ్మకు బాధ కలిగించి ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తమ నేత చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు రాద్దాంతం చేస్తోందో అర్థం కావడం లేదని మాచర్ల జగన్నాథం, ఇతర నాయకులు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
సీనియర్ అయిన కుతూహలమ్మకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని వారన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే సభాధ్యక్ష స్థానంలో ఉన్న కుతూహలమ్మ తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు అడిగారు. కుతూహలమ్మ వ్యవహారాన్ని రాద్దాంతం చేయడం తగదని వారన్నారు.












Click it and Unblock the Notifications