ముంబయి వదలను: అమితాబ్

Amitabh Bachan
ముంబయి: తనపై ఎవరు ఎన్నిరకాలుగా వ్యాఖ్యానించినా తాను ముంబయిని వీడి వెళ్లే ప్రసక్తే లేదని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. కర్మభూమి పేరుతో సాగుతున్న విమర్శల వ్యవహారంలో అమితాబ్ తొలిసారిగా నోరు విప్పారు. నవనిర్మాన్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే తనపై చేస్తున్న విమర్శలకు ఆయన ముంబయిలోని ఓ స్థానిక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిస్పందించారు. తనపై ఎన్ని రకాలుగా దూషణలు చేసినా, చివరకు దాడులు చేసిన తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు.

నవనిర్మాణ్‌సేన చేస్తున్న విమర్శలకు భయపడి తాను ముంబయిని వీడి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబయిలో తన పోస్టర్లు చింపివేయడం, తన సినిమాల ప్రదర్శనలను నిలిపివేయడం ద్వారా తనను అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. తనను రాళ్లతో కొట్టినా ముంబయిని వదిలి వెళ్లబోనని ఆయన అన్నారు. అమితాబ్ ను కర్మభూమి పరిధిలోకి తీసుకోవడం తగదని శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే తమ పత్రిక సామ్నాలో రాశారు. అయితే నవనిర్మాణ్ సేన మాత్రం అమితాబ్ పై సమరాన్ని అపలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+