గాంధీ హాస్పిటల్ జూనియర్లు డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు బుధవారం ఆందోళనకు దిగారు. జకీర్ అనే పిజి విద్యార్థిని రోగుల బంధువులు కొట్టడంతో అందుకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ముందు వారు ధర్నాకు దిగారు. రోగి బంధువుల దాడిపై అవుట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, వారిని అరెస్టు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం లోగా ప్రతిస్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాడికి ఆస్పత్రి అధికారులు బాధ్యత వహించాలని వారన్నారు.












Click it and Unblock the Notifications