సియం ఆఫీసు వద్ద మహిళ హడావిడి

హైదరాబాద్: సచివాలయంలో సి బ్లాక్ లోని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన అంజలి అనే మహిళను భద్రతా సిబ్బంది బుధవారం అదుపులోకి తీసుకున్నారు. క్వార్టర్ విషయంలో తనకు అధికారులు అన్యాయం చేశారని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించడానికి వచ్చానని చెబుతూ ఆమె ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సందర్శకులను కలవడానికి సమయం ఇచ్చారు. అయితే ఆ సమయం కన్నా ముందే ఆ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించింది.

హైదరాబాదులోని మలకపేటకు చెందిన అంజలి తనకు కేటాయించిన క్వార్టరును వేరొకరికి కేటాయించారని ఆమె ఆరోపించింది. తన భర్తకు ఆ క్వార్టరును కేటాయించారని, 20, 30 ఏళ్లుగా తాము ఆ క్వార్టరులోనే ఉంటున్నామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేరేవారితో కుమ్మక్కయి తమను ఖాళీ చేయించడానికి దాన్ని వేరొకరికి కేటాయించారని ఆమె అంటోంది. ఈ విషయాన్ని తాను నేరుగా ముఖ్యమంత్రికి నేరుగా చెప్పేందుకే వచ్చానని ఆమె చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+