తెలంగాణను కాదనలేదు: దామోదర్
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెసుకే ఎక్కువ సీట్లు గెలుస్తామని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, మొదటి నుంచి తాము అనుకూలమేనని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా ఉంది కాబట్టే 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుందని ఆయన చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ ఎప్పుడూ కాదనలేదని, ఇప్పుడు కూడా అనడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications