జంపన్న భార్య రేణుక లొంగుబాట
ఖమ్మం: మావోయిస్టు నాయకురాలు రేణుక శుక్రవారంనాడు ఖమ్మం పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ముందు లొంగిపోయింది. వ్యక్తిగత కారణాల వల్ల, అనారోగ్యం వల్ల ఆమె లొంగిపోయినట్లు ఎస్పీ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న భార్య. 14 ఏళ్ల వయస్సులో నక్సలైట్లలో చేరిన రేణుక 1998లో జంపన్నను పెళ్లి చేసుకుంది.
ఖమ్మం జిల్లా వెంకటాపురం దళ కార్యదర్శిగా ఆమె పనిచేస్తోంది. ఆమెపై మూడు లక్షల రివార్డు ఉంది. అసరవెల్లి పోలీసు స్టేషనుపై దాడికి సంబంధించిన కేసుతో పాటు మరికొన్ని కేసులు ఆమెపై ఉన్నాయి. ఆమె స్వగ్రామం లింగాల. దాదాపు 14 ఏళ్ల పాటు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది.












Click it and Unblock the Notifications