గుంటూరు కౌన్సిల్ సమావేశంలో రభస
గుంటూరు: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో సోమవారం తీవ్ర రభస జరిగింది. తెలుగుదేశం, కాంగ్రెస్ కార్పోరేటర్ల మధ్య వాగ్వివాదం, ముష్టిఘాతం చోటుచేసుకున్నాయి. మేయర్ కన్నా నాగరాజు రాజీనామాపై ఈ వివాదం చెలరేగింది. మేయర్ పై అవిశ్వాసం చెల్లదని టిడిపి సభ్యులు వాదించారు.
మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాలకు ఆమోదం లభించింది. మేయర్ రాజీనామా విషయంపైనే ఇటీవల కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాజీనామాను ఆమోదించకుండానే గొడవ మధ్యనే కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.












Click it and Unblock the Notifications