లెఫ్ట్ నేతలతో చిరు హితుడి చర్చలు

మిత్రతో జరిగిన చర్చలకు ప్రాధాన్యం లేదని బి.వి. రాఘవులు చెప్పారు. అయితే రాజకీయాలు మాత్రం చర్చించామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని మిత్రా రాఘవులుకు, నారాయణకు తెలియజేసినట్లు సమాచారం. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా అని రాఘవులు అడిగారట. రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి తన విధానాలను ప్రకటించిన తర్వాత, ఆ విధానాలను బట్టి కలిసి పని చేసే విషయాన్ని ఆలోచిస్తామని రాఘవులు మిత్రాతో చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికల తర్వాత చిరంజీవి తన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి పార్టీ ఎజెండాలో కమ్యూనిస్టు సిద్ధాంతాల మూలాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో వామపక్షాల పొత్తును నివారించేందుకు మిత్రా కమ్యూనిస్టు పార్టీల నాయకులతో చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత తెగదెంపులు చేసుకోవడం కష్టమవుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications