ఉప ఎన్నికల తర్వాత చిరు పార్టీ: నారాయణ

Chiranjeevi
విజయవాడ: వచ్చే ఉప ఎన్నికల్లో తాము నాలుగు శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఈ విషయమై తాము ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్ర సమితి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. స్టేషన్ ఘనపూర్, మేడారం, హుజురాబాద్, ఆలేరు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సిపిఎం పోటీ చేసే స్థానాల్లో తాము పోటీ చేయబోమని, సిపిఎంకు మద్దతు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు అనవసరమైన ప్రయాస అని, ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి పోటీ చేయకతప్పదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఈ నెల 27వ తేదీన చర్చలు జరగనున్నాయి.

ఉప ఎన్నికల తర్వాత తమ పార్టీని ప్రకటిస్తామని చిరంజీవి సన్నిహితులు చెప్పారని, తాము చిరంజీవితో కలిసి తృతీయ ప్రత్యామ్నాయనికి సిద్ధమేనని ఆయన చెప్పారు. వామపక్షాలతో తృతీయ ప్రత్యామ్నాయానికి సిద్ధమని చిరంజీవి సన్నిహితులు చెప్పారని ఆయన అన్నారు. చిరంజీవి రాజకీయ విధానాలు చూసిన తర్వాత తాము కలిసి పని చేసే విషయంపై ఆలోచిస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+