చిరు పార్టీ బాగుంటుంది: మిత్రా

Chiranjeevi
హైదరాబాద్: అన్నింటికీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రకటన చేసే వరకు వేచి ఉండడం మంచిదని ఆయన రాజకీయ సలహాదారు డాక్ట్రర్ మిత్రా అన్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఇంతకు ముందు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటనే సరైందని, అల్లు అరవింద్ ప్రకటన ప్రకారమే జరుగుతుందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. చిరంజీవి పార్టీతో పొత్తుల గురించి తానేమీ చర్చించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాహిత విధానాలనే చిరంజీవి అనుసరిస్తారని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే విధానాలతో చిరంజీవి పార్టీ రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. వామపక్షాలతో చిరంజీవి పార్టీ పొత్తుల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులును తాను మామూలుగానే కలిశానని, రాఘవులు తనకు మంచి మిత్రుడని, రాఘపులు మెడనొప్పితో బాధపడుతుంటే చూడడానికి వెళ్లానని ఆయన వివరించారు. తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా సిపిఎం కార్యాలయానికి వెళ్లడం తనకు పరిపాటి అని, అక్కడ అందరూ తనకు తెలుసునని ఆయన చెప్పారు. అలా వెళ్లినప్పుడు పిచ్చాపాటీగా రాజకీయాలు చర్చించడం మామూలేనని, అదే విధంగా ఈ రోజు కూడా మాట్లాడామని ఆయన చెప్పారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ విధానాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పడం కూడా సర్వసాధారమైన విషయమేనని, ఎవరైనా అదే విధంగా చెప్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+