జూ.ఎన్టీఆర్ కోసం బాలయ్య

కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు. గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మాటను తీసేయలేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కొడాలి నానికి టికెట్ ఇచ్చారు. నానిని గన్నవరం నుంచి శాసనసభకు గెలిపించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేశారు. యువతలో క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే బుధవారంనాటి సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వయంగా బాలకృష్ణ వచ్చి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా హరికృష్ణ కుమారుడే. అయితే వీరిద్దరి తల్లులు వేరు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడడానికి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు.
బాబాయ్ బాలకృష్ణ తన సినిమా ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టడం ఆనందంగా ఉందని జూ. ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ కలివిడిగా మాట్లాడుకోవడం అందర్నీ ఆకర్షించింది. ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ నళ్లకల్లద్దాలు ధరించి హాజరు కావడం చెప్పుకోదగ్గ విశేషం.












Click it and Unblock the Notifications