మరో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామక పోటీల్లో మంగళవారం మరో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారంనాడు పరుగు పోటీ పరీక్షలో మరో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి చెందాడు. సోమవారంనాడు వరంగల్లులో ఒక అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారంనాడు విజయవాడలో జరిగిన పరుగు పోటీలో శ్రావణ్ కుమార్ అనే యువకుడు సొమ్మసిల్లి పడిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
విజయవాడలో జరిగిన కానిస్టేబుళ్ల నియామక శరీర దారుఢ్య పరీక్షలో భాగంగా కొత్తూరు - తాడేపల్లిల మధ్య ఐదు కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 2వేల మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన శ్రావణ్ కుమార్ పరుగు తీస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే లాభం లేకపోయింది. అతను ప్రాణాలు విడిచాడు. వరంగల్లులో జరిగిన పోటీల్లో ఒక యువతి సొమ్మసిల్లి పడిపోయింది.












Click it and Unblock the Notifications