ఉప ఎన్నికల్లో టిడిపితో సిపిఎం పొత్తు
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేయని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని సిపిఎం పోలిట్ బ్యూరో నిర్ణయించింది. సిపిఐ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో మినహా మిగతా చోట్ల సిపిఎం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరుస్తుంది. సిపిఐ మేడారం, హుజూరాబాద్, స్టేషన్ ఘనపూర్, ఆలేరు స్థానాల్లో పోటీ చేయాలని సిపిఐ నిర్ణయించుకుంది. సిపిఎం ముషిరాబాద్, చేర్యాల శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఈ ఆరు స్థానాల్లో మినహా మిగతా స్థానాల్లో సిపిఎం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సిపిఎం బలపరుస్తుంది.
వామపక్షాల అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో కార్యకర్తలు అయోమయానికి గురి కాకుండా, జాతీయ రాజకీయ అవసరాల దృష్ట్యా వామపక్షాలు పోటీ చేయని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని సిపిఎం పోలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీకి సూచించింది. తెలుగుదేశం, కాంగ్రెసుకు సమాన దూరం పాటించాలని సిపిఐ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల వ్యవహారాన్ని, అనుసరించాల్సిన పొత్తుల అంశాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు మంగళవారం కోల్ కత్తాలో సమావేశమైన పోలిట్ బ్యూరో ముందు ఉంచారు.












Click it and Unblock the Notifications