సిపిఐ నేత 'దాసరి' అంత్యక్రియలు
విజయవాడ: రెండు రోజుల క్రితం హైదరాబాదులో కన్ను మూసిన సిపిఐ వృద్ధ నేత దాసరి నాగభూషణ రావు అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం కృష్ణా జిల్లాలోని దిగవల్లిలో జరిగాయి. దాసరి నారాయణరావు కోరిక మేరకు ఆయన చితికి సోదరుడు నర్సింహారావు నిప్పంటించారు. ఆయన అంత్యక్రియలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. సిపిఎం నాయకుడు బి.వి. రాఘవులు, సిపిఐ నాయకుడు కె. నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు, కాంగ్రెస్ నాయకుడు పాలడుగు వెంకట్రావు తదితరులు హాజరయ్యారు.
దాసరి నాగభూషణరావు 1997లో రాసిన వీలునామాను సిపిఐ నాయకులు తెరిచారు. స్వగ్రామంలో తనకు గల రెండు ఎకరాల భూమిలో సిపిఐ రాష్ట్ర సమితికి, చండ్ర రాజశ్వేరరావు ఫౌండేషన్ కు చెరో ఎకరం చొప్పున రాసిచ్చారు. మార్గదర్శిలో డిపాజిట్ చేసిన లక్ష రూపాయలను తెలంగాణ అమర వీరులకు, మరో సంస్థకు చెరి సగం చొప్పున రాశారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా పనిచేసిన దాసరి నాగభూషణరావు ఆదివారంనాడు హైదరాబాదులో కన్ను మూశారు.












Click it and Unblock the Notifications