ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆదిలాబాద్: పరీక్షల్లో తప్పడంతో మానసిక వ్యధకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని స్వరూప ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో సిఇసి గ్రూప్ తో ఇంటర్మీడియట్ చదివిన స్వరూప సోమవారం రాత్రి క్రిమిసంహాకర మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్వరూప పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్వరూపను వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
స్థానిక ఆస్పత్రి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా స్వరూప మరణించింది. తన స్నేహితలందరూ ఉత్తీర్ణులై తాను తప్పినందుకు స్వరూప తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు చెబుతున్నారు. తన తల్లిండ్రుల ఆశలను నిలబెట్టలేకపోయానని ఆ 17 ఏళ్ల బాలిక మథనపడింది.












Click it and Unblock the Notifications