కృష్ణమాదిగ దీక్ష: మాదిగల విధ్వంసం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగకు మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు మంగళవారం ఆందోళనలకు దిగారు. కొన్ని చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రకాశం, అనంతపురం, కర్నూలూ జిల్లాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాలను దగ్ధం చేశారు. కర్నూలులోని సంక్షేమ భవన్ లో రెండు జీపులకు నిప్పంటించారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాదిగలు ఆందోళనలకు దిగారు. పెట్రోల్ క్యానులు పట్టుకుని కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖపట్నంలో మాదిగలు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ చేపట్టిన నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. తన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కృష్ణమాదిగ ఆరోపిస్తున్నారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని ఆందోళనకారులు పెట్రోలు, కిరోసిన్ డబ్బాలు చేత పట్టుకుని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications