సిరీస్ ప్రమాదం: కార్మికుల మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీనగరులో గల సిరీస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులు ఆస్పత్రిలో మరణించారు. ఆదివారం రియాక్టర్లు పేలడంతో సిరీస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సత్యనారాయణ సోమవారం రాత్రి మరణించగా సత్తిరాజు మంగళవారం ఉదయం మరణించాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఇద్దరు కార్మికులను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఉస్మానియా వైద్యులు వారిని పట్టించుకోలేదు. దాదాపు ఐదు గంటలకు కూడా వైద్యులు ఎవరూ రాకపోవడంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సిరీస్ అగ్ని ప్రమాదంపై నివేదిక తెప్పిస్తున్నామని, యాజమాన్యానిది పొరపాటు ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక మంత్రి జి. వినోద్ చెప్పారు.












Click it and Unblock the Notifications