తెరాస ఎన్నికల తమాషా: బాబు

తెలంగాణపై తాము వేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి తాము ఎంతో కృషి చేశామని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతాల్లో తాము నిధులు అధికంగా ఖర్చు చేశామని ఆయన చెప్పారు. తమ పట్ల ప్రజలకు విశ్వసనీయత ఉందని ఆయన చెప్పారు. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రతిపక్షాల నాయకలనూ కార్యకర్తలనూ కొని కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు తీరుపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications