గోల్డ్ క్వెస్ట్ ఆఫీసులకు తాళాలు
హైదరాబాద్: హైదరాబాదులోని గోల్డ్ క్వెస్ట్ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సికింద్రాబాదులోని గోల్డ్ క్వెస్ట్ హైదరాబాదు ప్రధాన కార్యాలయం వద్ద ఖాతాదారులు పెద్ద యెత్తున గుమికూడారు. ఈ సమయంలో సిబ్బందికి, ఖాతాదారులకు మధ్య గొడవ జరిగింది. ఖాతాదారులపై సిబ్బంది దాడికి దిగారు. మీడియాతో మాట్లాడవద్దని ఖాతాదారులకు వారు సూచించారు. పెద్ద యెత్తున ఖాతాదారులు గుమికూడడంతో ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది.
గోల్డ్ క్వెస్ట్ కుంభకోణంలో దోషులెవరైనా వదలబోమని పోలీసు అదనపు డైరెక్టర్ జనకల్ ఎ.కె. ఖాన్ చెప్పారు. ఖాతాదారులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. గోల్డ్ క్వెస్ట్ పై విధించిన స్టేను ఎత్తేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. గోల్డ్ క్వెస్ట్ పై విచారణకు సిఐడికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications