కెసిఆర్ వల్లనే ఈ స్థితి: జీవన్ రెడ్డి

K ChandraSekhar Rao
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వల్లనే తెలంగాణపై రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (రెండో ఎస్సార్సీ) వేయలేకపోయామని కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. రెండో ఎస్సార్సీ వేసే సమయంలో కెసిఆర్ ఏకాభిప్రాయ సాధన అంశాన్ని ముందుకు తెచ్చారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)ప్రభుత్వం తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయిందని, భాగస్వామ్య పార్టీల్లో కొన్ని తెలంగాణను వ్యతిరేకిస్తున్నందున అది సాధ్యం కాలేదని ఆయన అన్నారు.

తెలంగాణపై వామపక్షాలు పూటకో మాట మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సిపిఎం అంటోందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్నాయని, దీంతో ఏకాభిప్రాయ సాధన సాధ్యపడలేదని, ఈ విషయంలో తమకు కూడా బాధగానే ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+