గుల్బర్గాలో అయూబ్ ఖాన్ అరెస్టు
హైదరాబాద్: రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ ను టాస్కోఫోర్సు పోలీసులు మంగళవారం ఉదయం కర్ణాటకలోని గుల్బర్గాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయూబ్ ఖాన్ కు భార్య, నలుగురు కుమారులు, కూతురు ఉన్నారు. హైదరాబాదులోని కాలాపత్తర్ కు చెందిన అయూబ్ ఖాన్ పై 30కి పైగా కేసులున్నాయి. వీటిలో సగానికి పైగా హత్య కేసులే.
నెంబర్ లేని వాహనంలో వచ్చి అయూబ్ ను తీసికెళ్లినట్లు తన కోడలు ఫోన్ చేసి చెప్పిందని అయూబ్ తల్లి మెహబూబా బేగం అంటోంది. తన కుమారుడికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే తన కుమారుడిని కోర్టులో హాజరుపర్చాలని ఆమె కోరుతోంది.












Click it and Unblock the Notifications