వైయస్ పాలనలో రౌడీయిజం: బాబు

నేరచరిత్ర, అక్రమ సంపాదనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల కమీషన్ తప్పు పట్టినా ప్రభుత్వ వైఖరి మారడం లేదని ఆయన అన్నారు. విషజ్వరాల పాపం కాంగ్రెసుదేనని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే గొర్రెల కాపరులకు ఐదేసి ఎకరాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పులివెందులలో పాతికేళ్లుగా అమలు చేస్తున్న రౌడీయిజాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications