చిరు రాజకీయాలపై భారీ ప్రకటనలు తగవు: కెసీఅర్

K Chandrasekhar Rao
హైదరాబాద్ : రాజకీయాలపై ఇంకా మొహమాటం ప్రదర్శిస్తున్న చిరంజీవి గురించి రాజకీయనాయకులు మాట్లాడడం మంచిది కాదని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయానికి చిరు, చంద్రబాబులను తమతో ఏకం చేసుకుంటామని సీపీఎఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చేసిన వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు.

హైదరాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు తోక పార్టీలుగా పేర్కొన్నారు. రానున్న సాధారణ ఎన్నికల సమయానికి చిరు, బాబు సహా అన్ని పార్టీలను ఏకం చేసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు చేసిన ప్రకటన పిచ్చి మాటలేనని ఆయన దుయ్యబట్టారు. కాగా, ఈ ఉపఎన్నికలు ప్రత్యేక తెలంగాణకు రెఫరెండమని ఆయన మరో సారి స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నేత దేవేందర్ తాను మాట్లాడవలసినంత పెద్ద మనిషి కాదని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+