కోరితే జైపూర్ పోలీసులకు సాయం: ఖాన్
హైదరాబాద్: జైపూర్ లో జరిగిన పేలుళ్లకు గతంలో హైదరాబాదులో జరిగిన పేలుళ్లకు సంబంధం ఉండవచ్చునని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. జైపూర్ పోలీసులు కోరితే నిపుణుల బృందాన్ని పంపుతామని రాష్ట్ర అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎ.కె. ఖాన్ చెప్పారు. హైదరాబాదులో వాడిన సాంకేతిక పరిజ్ఞానమే జైపూరులో వాడినట్లు అనుమానిస్తున్నారు.
జైపూర్ పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులో, ఇతర ముఖ్య పట్టణాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హోటళ్లు, లాడ్జీలు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్లు ఖాన్ చెప్పారు. ఎక్కువ సేపు పార్కు చేసిన వాహనాలపై, వదిలేసి వెళ్లిపోయిన సంచులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.












Click it and Unblock the Notifications