చంద్రబాబు ఆదిలాబద్ యాత్ర విజయవంతం

కాంగ్రెస్ హయాంలో పేదలు పేదలుగానే మగ్గిపోతున్నారని.. పథకాలన్నీ నాయకులు, మధ్యవర్తులే దిగమింగుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై వైఎస్ సర్కారు సవతితల్లి ప్రేమ చూపిస్తోందని బాబు దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే.. రోజుకు 12 గంటలపాటు ఫ్రీ పవర్ ఇస్తామని.. మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వడంతో పాటు, డ్వాక్రా సంఘాలను పటిష్టపరుస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో పేద యువతుల వివాహానికి ఉచితంగా మంగళసూత్రాలు అందిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం పేరిట కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని.. బాబు ఆరోపించారు. భైంసా, నిర్మల్, ముధోల్ నియోజక వర్గాల్లో సాగిన యాత్రకు ప్రజలనుంచి భారీ స్పందన కనిపించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి వేణుగోపాలాచారిని గెలిపించాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ నాయకులపై.. అసమ్మతి నాయకులపై విమర్శలు గుప్పించారు. రెండు రూపాయల కిలో బియ్యం కింద నెలకు కోటాను 50 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉపఎన్నికల నేపథ్యంలో సాగుతున్న ఈయాత్ర పార్టీకి ఉపయోగపడుతుందని తెలుగుతమ్ముళ్లు భావిస్తున్నారు












Click it and Unblock the Notifications