జైపూర్ పేలుళ్లు: మృతులు 85
జైపూర్: జైపూర్ వరస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 85కు చేరుకుంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని రాజస్థాన్ హోం మంత్రి అంటున్నారు. ఇప్పటి వరకు 55 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, గాయపడిన వారికి లక్ష రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా చెప్పారు. బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పేలుళ్లకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతను ముంబైకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
జైపూర్ పేలుళ్లకు పాల్పడింది హుజీ అని పోలీసులు తేల్చారు. రాజస్థాన్ మొత్తంలో హుజీ స్థావరాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైకిళ్లకు అమర్చి ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. అవన్నీ కొత్త సైకిళ్లే. వాటిని హోల్ సేల్ షాపుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ షాపులను కూడా పోలీసులు పసిగట్టారు. పేలుళ్లకు ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వాడినట్లు పోలీసులు తేల్చారు. బాంబుల్లో మేకులు వాడినట్లు కూడా గుర్తించారు. మేకులు వ్యక్తలు శరీరాల్లోకి గుచ్చుకుపోయాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.












Click it and Unblock the Notifications