తెలంగాణ రాష్ట్రానికి దళిత సిఎం: కెసీఅర్

K Chandrasekhar Rao
ఆదిలాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే దళితుణ్ని సీఎం చేస్తామని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఉపఎన్నికల ప్రచారాన్ని చేశారు. తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని..వారే తమను గెలిపిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభనుద్దేశించి ఆయన వాడి, వేడిగా ప్రసంగించారు.

తెలంగాణ విషయంలో వైఎస్, చంద్రబాబులు ఇద్దరూ ఒకటేననీ.. వారిని నమ్మే స్థితిలో ఈప్రాంత ప్రజలు లేరని కేసీఆర్ అన్నారు. ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా తెలంగాణపై రిఫరెండమేనని .. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి.. టీఆరెస్ కు ఓటువేయాలని ఆయన పిలుపిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పథకాలకు చెందిన 13వేల 800 కోట్ల నిధులు దారిమళ్లాయని ఆయన విమర్శించారు.

తాము అధికారంలోకి వస్తే...గిరిజనుల ఆరాధ్య దైవమైన కొమరంభీం స్వస్థలం జోడేఘాట్ ను వందకోట్ల రూపాయలతో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తామని కేసీఆర్ హామీఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు , పింఛన్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగాన్ని పారదోలతామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అనుకూల - ప్రతికూల వాదానికి మద్య జరుగుతున్న పోరాటమని.. ఈ పోరులో అంతిమ విజయం తెలంగాణదేనని కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆషామాషీ విజయం ఇవ్వద్దనీ.. అఖండ మెజారిటీతో టీఆరెస్ అభ్యర్ధులను గెలిపించి..ఢిల్లీకి తెలంగాణ దెబ్బ రుచి చూపాలన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+