హైకోర్టులో రమేష్ రాథోడ్ అపీల్
హైదరాబాద్: తన నామినేషన్ తిరస్కృతిపై ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ తెలుగుదేశం అభ్యర్థి రమేష్ రాథోడ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నామినేషన్ తిరస్కృతిపై ఆయన హైకోర్టులో అపీల్ చేసుకున్నారు. దీంతో కోర్టు రిటర్నింగ్ అధికారికి, ప్రధాన ఎన్నికల అధికారికి నోటీసులు జారీ చేసింది. ఒక కేసులో శిక్ష పడినందుకుగాను రిటర్నింగ్ అధికారి రమేష్ రాథోడ్ నామినేషనును తిరస్కరించారు. ఈ కేసు విచారణను హైకోర్టు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.
అటవీశాఖ అధికారి కొండలరావుపై దాడి చేశారనే కేసులో రమేష్ రాథోడ్ కు కింది కోర్టు రెండేళ్లు జైలు శిక్ష వేసింది. కింది కోర్టు తీర్పును ఆయన జిల్లా కోర్టులో సవాల్ చేశారు. జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. గుడిసెల తొలగింపు సందర్భంగా అధికారులో రమేష్ రాథోడ్ వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications