జైపూర్ లో పేలుళ్ళు: 60 మంది మృతి

గాయపడిన వారిలో చాలా మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇది ముస్లిం తీవ్రవాద సంస్ధలైన హుజి, జైషేల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన పేలుళ్ళకు, జైపూర్ విస్ఫోటనాలకు మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించింది.












Click it and Unblock the Notifications