కల్తీ మద్యానికి 27 మంది బలి
బెంగుళూరు: కల్తీ మద్యాన్ని సేవించి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం రోజు27 మంది మరణించారు. కోలార్లో 14మంది, బెంగుళూరు లోని డిజి హళ్ళి లో ఐదుగురు, ఈ ప్రాంతానికి సమీప గ్రామం తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరిలో ఎనమిది మంది కల్తీ మద్యం కారణంగా మరణించారు. ఇంకా పలువురు అక్రమ మద్యం కారణంగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మృతుల బంధువుల ఏడుపులతో ఆసుపత్రి వాతావరణం హృదయాన్ని కలచివేస్తుంది. కోలార్, క్రిష్ణగిరి ప్రాంతాల్లో ప్రజలు మద్యం షాపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రధర్శనలు నిర్వహించి, మృతుల బంధువులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కర్పూరం, పొగాకు తోపాటూ ఇతర రసాయనాలు మధ్యంలో కలపడం కారణంగా మద్యం విషపూరితమై ప్రాణహాని సంభవించిందని సమాచారం. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు అన్నారు.












Click it and Unblock the Notifications