సోనియా నిర్ణయం: వైయస్

కరీంనగర్: తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కరీంనగర్ లోకసభ స్థానంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణపై సోనియా గాంధీ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

కరీంనగర్ లోకసభ నియోజకవర్గాన్ని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పట్టించుకోలేదని ఆయన అన్నారు. చంద్రశేఖరరావుపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి ఇచ్చి వుంటే కెసిఆర్ తెరాసను స్థాపించేవారా అని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+